Share News

కీడల అభివృద్ధికి ఎన్టీపీసీ కృషి

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:52 PM

ప్రభావిత ప్రాంతాల్లో క్రీడాభి వృద్ధికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేస్తుందని జీఎం ముకల్‌రాయ్‌ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టీఎస్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదా నంలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు.

కీడల అభివృద్ధికి ఎన్టీపీసీ కృషి

జ్యోతినగర్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ప్రభావిత ప్రాంతాల్లో క్రీడాభి వృద్ధికి ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చేస్తుందని జీఎం ముకల్‌రాయ్‌ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ టీఎస్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదా నంలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిం చారు.

ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు క్రీడా సౌకర్యాలను కల్పించడంతోపాటు పోటీల ద్వారా వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. రామగుండం పరిధిలోని రామగుండం, అంతర్గాం, పాల కుర్తి, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు యేటా పోటీలు నిర్వహిస్తున్నామని జీఎం తెలిపారు. ఎన్టీపీసీ ఏజీఎం హెచ్‌ఆర్‌ విజయ్‌కుమార్‌, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. రూరల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా రామగుండం, కమాన్‌పూర్‌, పాలకుర్తి, అంతర్గాం, మండలాలకు చెందిన 21 పాఠశాల విద్యార్థులకు ఖోఖో, వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు.

Updated Date - Mar 16 , 2026 | 11:52 PM