విద్యార్థుల సాధికారతకు ఎన్టీపీసీ ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:15 AM
విద్యాభివృద్ధితో పాటు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక వికాసం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రామగుండం ఎన్టీ పీసీ యాజమాన్యం పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. శుక్రవారం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 40 డ్యుయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.
జ్యోతినగర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధితో పాటు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక వికాసం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే దిశగా రామగుండం ఎన్టీ పీసీ యాజమాన్యం పలు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. శుక్రవారం ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 40 డ్యుయల్ డెస్క్ బెంచీలను అందజేశారు. బాలికల్లో శారీరక దృఢత్వం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు నెలల యోగా, స్వీయ రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీపీసీ దీప్తి మహిళ సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. 8, 9వ తరగతులకు చెందిన బాలికలకు యోగా మ్యాట్లు, టీ షర్టులు, ట్రాక్ ప్యాంట్లు పంపిణీ చేశారు. ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ అధికారులు, దీప్తి మహిళ సమితి సభ్యులు విద్యార్థులు ఉపాద్యాయులు పాల్గొన్నారు.