దేశాభివృద్ధిలో ఎన్టీపీసీ కీలక భాగస్వామి
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:25 AM
దేశాభివృద్ధిలో ఎన్టీపీపీ కీలక భాగ స్వామ్యమని రామగుండం ఎన్టీపీసీ, టీఎస్‌టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చం దన్‌కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్టీపీసీ టీఎస్‌లోని మహాత్మా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈడీ ప్రసంగించారు.
జ్యోతినగర్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో ఎన్టీపీపీ కీలక భాగ స్వామ్యమని రామగుండం ఎన్టీపీసీ, టీఎస్‌టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చం దన్‌కుమార్ సామంత అన్నారు. శనివారం ఎన్టీపీసీ టీఎస్‌లోని మహాత్మా గాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈడీ ప్రసంగించారు. ఐదు దశాబ్దాలుగా విద్యుత్ కొరత సమస్యను తీరుస్తూ దేశానికి వెలుగులను అందిస్తోందన్నారు. దక్షిణాది రాష్ర్టాలకు రామగుం డం ఎన్టీపీసీ, స్వరాష్ట్రానికి తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందన్నారు. ఉద్యోగులు, అధికారులు, కార్మి కుల కృషి వల్లె ఎన్టీపీసీ దేశంలోనే అగ్రగామి విద్యుత్ సంస్థగా అభివృద్ధి చెందిందన్నారు. ఏడీ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సీఐఎస్‌ఎఫ్ ఫైర్‌వింగ్ ఆధ్వర్యంలో త్రివర్ణ ప్రదర్శన, టౌన్‌షిప్ సెక్యూరిటీ, పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో త్రివర్ణ బెలూన్లను ఎగు రవేశారు. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.