Share News

ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:51 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

 ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన

పాలకుర్తి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జీడినగర్‌లో గురువారం సీనియర్‌ నాయకుడు నడిపెల్లి మురణిధర్‌రావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, పంటలకు మద్ధతు ధర తదితర అంశాల్లో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతులకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి రూ. 12 వేలకే పరిమితం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రైతులను సమీకరించి ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు తెలిపారు. పాలకుర్తి, అంతర్గాం మండలాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రాగం శ్రీనివాస్‌, కోల సంతోష్‌, నాయకులు మేకల సమ్మయ్య, మూల విజయరెడ్డి,పద్మజా, బండి శ్రీనివాస్‌, అల్లం రాజయ్య, మామిడాల ప్రభాకర్‌, జిమ్మి బాబు, కోల లత, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గోన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 11:51 PM