రెండో రోజు నామినేషన్ల జోరు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:07 AM
జిల్లాలో ని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొ రేషన్‌లో మొత్తం 440నామినేషన్లు దాఖలయ్యా యి. బుధవారం మొదటి రోజు 102నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 338మంది నామి నేషన్లు వచ్చాయి. ఇందులో రామగుండంలో 168, మంథనిలో 56, సుల్తానాబాద్‌లో 37, పెద్ద పల్లిలో 77నామినేషన్లు వచ్చాయి.
కోల్‌సిటీ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ని మూడు మున్సిపాలిటీలు, రామగుండం కార్పొ రేషన్‌లో మొత్తం 440నామినేషన్లు దాఖలయ్యా యి. బుధవారం మొదటి రోజు 102నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 338మంది నామి నేషన్లు వచ్చాయి. ఇందులో రామగుండంలో 168, మంథనిలో 56, సుల్తానాబాద్‌లో 37, పెద్ద పల్లిలో 77నామినేషన్లు వచ్చాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మొదటి రోజు 13, గురు వారం 168నామినేషన్లు దాఖ లయ్యాయి. మొత్తంగా 181 నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో బీజేపీ 32, సీపీఎం 3, కాంగ్రెస్ 68, బీఆర్‌ఎస్ 35, ఇతర రిజిష్టర్ పార్టీలు, ఇండపెండెంట్లు 26మంది ఉన్నారు. మం థనిలో మొదటి రోజు 13 రాగా, రెండో రోజు 56 నామినేషన్లు దఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 28, బీఆర్‌ఎస్ 18, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 4 ఉన్నాయి. సుల్తానాబాద్ మున్సి పాలిటీలో 15 వార్డులకు మొదటి రోజు 24 నామి నేషన్లు దాఖలు కాగా గురు వారం 30నామినేషన్లు దాఖ లయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 20, బీజేపీ 18, బీఆర్‌ఎస్ 14, బీఎస్‌పీ 1, ఇతర రిజిష్టర్ పార్టీలు 3, ఇండిపెండెంట్లు ఐదు ఉన్నాయి. పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36వార్డులకు మొదటి రోజు 52నామినేషన్లు దాఖలు కాగా గురువారం 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ 24, బీఎస్‌పీ 1, కాంగ్రెస్ 50, ఎంఐఎం 2, బీఆర్‌ఎస్ 25, ఇతర రిజిష్టర్ పార్టీలు 13, స్వతంత్రులు 14 నామినే షన్లు మొత్తంగా 124 నామినేషన్లు దాఖల య్యాయి. గురువారం రామగుండంలో సాయంత్రం 5గంటల వరకు నామినే షన్ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ 7.30గంటల వరకు సాగింది. ఎలక్షన్ కమిషన్ సైట్‌లో అప్‌లోడ్ చేయ డంలో జాప్యం ఏర్పడుతోంది. శుక్రవారం నామినేషన్లకు చివరి తేది కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.