ఉద్యోగాల పేరిట మోసం చేసిన వారిపై చర్యలేవీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:39 PM
ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన వారిపై చర్య లెందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ సంఘం అధ్యక్షుడు అంబటి నరేష్ ఆరోపించారు. మం గళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన వారిపై చర్య లెందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ సంఘం అధ్యక్షుడు అంబటి నరేష్ ఆరోపించారు. మం గళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల పేరిట కోట్ల రూపా యలు కార్మికుల నుంచి దోచుకుని ఆ డబ్బును భూములపై పెట్టుబడి పెట్టారని, డబ్బులు చెల్లించా లని డిమాండ్ చేస్తే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేశారన్నారు. భూమి అమ్మిన తరువాత మిగతా డబ్బులు చెల్లిస్తా మని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, అఖిలపక్షం ఆనాడు మాట ఇచ్చి కార్మికులను మోసం చేశారని, గోదావరి వద్ద 18ఎకరాల భూమి అమ్ముతామని చెప్పి ఇప్పుడు వాటిని డీటీసీపీ అప్రూవల్ తీసుకువచ్చి ప్లాట్లుగా మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. గోదావరిలో మునిగిపోయే భూములకు ఎలా లేఅవుట్ ఇస్తారని ప్రశ్నించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మికులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. భూములు అమ్మే హక్కు వారికి ఎవరు ఇచ్చారని, ఆర్‌ఎఫ్‌సీఎల్ కార్మికుల వద్ద వసూలు చేసిన డబ్బులతో భూములు కొన్నారని, తక్షణమే ఆ భూమి అమ్మి డబ్బులను కార్మికులకు చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్మికులు రాంకీ, శ్రావణ్, పూర్ణ చందర్, రమేష్, మల్లేష్, తిరుపతి, సత్యనారాయణ, సతీష్, కుమారస్వామి, సతీష్ కుమార్ పాల్గొన్నారు.