సుల్తానాబాద్ అభివృద్ధిలో గత పాలకుల నిర్లక్ష్యం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:35 PM
సుల్తానా బాద్ అభివృద్ధిలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, తాను ప్రాధాన్యత ఇస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి రూ.12 కోట్లతో చేపట్టే పనుల శిలాఫలకాన్ని మంగళవారం ఆవిష్క రించారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సుల్తానా బాద్ అభివృద్ధిలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, తాను ప్రాధాన్యత ఇస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి రూ.12 కోట్లతో చేపట్టే పనుల శిలాఫలకాన్ని మంగళవారం ఆవిష్క రించారు. ఆయన మాట్లాడుతు దశాబ్దాల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న చెరువు అభివృద్ధి పనుల వల్ల సుల్తానాబాద్‌తోపాటు సమీప గ్రామాలలోని పంట పొలాల ఆయకట్టు స్థిరీకరణ మెరుగవుతుం దన్నారు. చెరువు కట్ట అభివృద్దితో రవాణా సౌకర్యం బాగుపడుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలోని ప్రధా న రోడ్లను విస్తరించామని, సెంట్రల్ లైటింగ్ సిస్టం, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రశ్నించాలన్నారు. మున్సిపాలిటీ భవనం ప్రస్తుత అవసరాలకు అనుగు ణంగా లేదని, త్వరలోనే కొత్త భవనాన్ని అన్ని హం గులతో నిర్మించేందుకు నిధులు మంజూరీ చేయిస్తాన న్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వైస్‌చైర్ పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు, కమిషనర్ రమేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ, డీఈఈ,ఏఈ ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ బషీరొద్దిన్ పాల్గొన్నారు.
ఫ రూ. 5 కోట్లతో ఐబీ భవన నిర్మాణం
సుల్తానాబాద్ రోడ్డు భవనాల శాఖ అతిథిగృహం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఇటీ వల ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైందని, ఐబీ భవన సముదాయానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలో ఐదు కోట్ల రూపాయలు మంజూరవుతాయని, భవనం నిర్మిస్తామన్నారు.