Share News

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:31 AM

వృత్తి నైపుణ్యం, సామర్థ్యాన్ని పోలీస్‌ సిబ్బంది పెం పొందించుకోవాలని రామగుండం సీపీ అం బర్‌ కిశోర్‌ ఝా సిబ్బందికి సూచించారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరే ట్‌లో మూడో పోలీస్‌ డ్యూటీ మీట్‌-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

కోల్‌సిటీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్యం, సామర్థ్యాన్ని పోలీస్‌ సిబ్బంది పెం పొందించుకోవాలని రామగుండం సీపీ అం బర్‌ కిశోర్‌ ఝా సిబ్బందికి సూచించారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరే ట్‌లో మూడో పోలీస్‌ డ్యూటీ మీట్‌-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మా ట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు సంబంఽధించిన అధికారులు, సిబ్బంది కంప్యూ టర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్‌, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, పేలుడు పదార్థాల గుర్తింపు, యాంటీ సబోటేజ్‌ తని ఖీలు, కంప్యూటర్‌ అవగాహన, ఫొటో, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహి స్తున్నట్టు చెప్పారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరి చిన అధికారులు, సిబ్బందికి జోనల్‌ స్థాయి, అనంతరం జాతీ య స్థాయిలో నిర్వహించే పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. శాస్త్రీయ దర్యాప్తు, వేలి ముద్రల విశ్లేషణ లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు, సంక్లిష్టమైన కేసుల పరిష్కారానికి అవసర మైన ఆలోచనలను పరస్పరం పంచుకోవ డానికి, వృత్తిపరమైన పని తీరు, సామర్థ్యా లను మెరుగుపర్చు కోవడానికి పోలీస్‌ డ్యూటీ మీట్‌ దోహదపడు తుందన్నారు. రామగుం డం కమిషరేట్‌కు, కాళేశ్వరం జోన్‌కు మంచి పేరు తీసుకురా వాలని సూచించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌, ఏఓ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:31 AM