Share News

ఎన్టీపీసీలో ఘనంగా జాతీయ భద్రతా దినోత్సవం

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:15 AM

రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్‌టీపీ ప్రాజెక్టుల్లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు గురువా రం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత పాల్గొన్నారు.

ఎన్టీపీసీలో ఘనంగా జాతీయ భద్రతా దినోత్సవం

జ్యోతినగర్‌, మార్చి5(ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్‌టీపీ ప్రాజెక్టుల్లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు గురువా రం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత పాల్గొన్నారు. రామగుండం, తెలంగాణ యూనిట్ల జనరల్‌ మేనేజర్లు, సీఐ ఎస్‌ఎఫ్‌ అధికారులు, విభాగాధిపతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొ న్నారు. సేఫ్టీ ఏజీఎం స్వాగత ప్రసంగం చేయగా, స్టేషన్ల భద్రతా పని తీరును వివరించారు. ఎన్టీపీసీ కార్యకలాపాల్లో భద్రతకు ఉన్న ప్రాధా న్యాన్ని, భద్రతా ఆచరణ, ప్రవర్తనలో నిరంతర అభివృద్ధి, అవసరాలను ఆయన వివరించారు.

ఈడీ చందన్‌కుమార్‌ భద్రతా పతాకాన్ని ఆవి ష్కరించి మాట్లాడారు. భద్రతను మెరుగుపరచడానికి ప్రజలను భాగస్వా ములను చేయాలని కోరారు. వారికి అవగాహన కల్పించి, శక్తివంతులుగా మార్చాలని పిలుపునిచ్చారు. భద్రతను కొనసాగించడంలో అన్ని విభా గాలు చేసిన కృషిని ఆయన అభినందించారు. అనంతరం భద్రతా ప్రతిజ్ఞ అనంతరం భద్రతా పరమైన పలు అంశాలను నిర్వహించారు. పలు శాఖల అధికారులతోపాటు జీఎంలు ముకుల్‌ రాయ్‌, మనిష్‌ అగర్వాల్‌, లింగయ్య, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:15 AM