ఒప్పందాల పేరిట మోసం చేస్తున్న జాతీయ సంఘాలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:02 AM
గత నెలలో 20 ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలే వాటి అమలు పట్టించుకోవడం లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఓసీపీ-1 సీహెచ్‌పీలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు.
యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గత నెలలో 20 ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలే వాటి అమలు పట్టించుకోవడం లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఓసీపీ-1 సీహెచ్‌పీలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసిన చివరి నెలలో 29 ఒప్పందాలను చేసుకున్నట్టు అబద్దాలను ఏఐటీయూసీ ప్రచారం చేస్తున్నదని, ఏఐటీయూసీ అబద్ధపు ప్రచారాలను నమ్మి మరోసారి కార్మికులు మోసపోవద్దని సూచించారు. యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు సర్క్యులర్ రూపంలో యాజమాన్యం జారీ చేయడం లేదో కార్మికులు ఆలోచించాలని కోరారు. సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై ఐటీ రీయింబర్స్ హామీలను నిలుపుకోలేదని విమర్శించారు. లాభాల వాటా ప్రకటించి, సంస్థ బకాయిలను వసూలు చేసేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగెల్లి సాంబయ్య, ఉదయ్, పర్లపల్లి రవి, సంపత్‌రెడ్డి, ఈసంపల్లి రమేష్, దేవ శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.