నానో యూరియాను వాడాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:29 AM
రైతు లు యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరి యాను వాడాలని జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల అన్నారు. శుక్రవారం చీకురాయి రైతు వేదిక లో ఇఫ్కో కంపనీ ఆధ్వర్యంలో సహకార సంఘాల సీఈవోలకు నానోయూరియా, నానో డీఏపీపై అవగా హన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పెద్దపల్లి రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రైతు లు యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరి యాను వాడాలని జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల అన్నారు. శుక్రవారం చీకురాయి రైతు వేదిక లో ఇఫ్కో కంపనీ ఆధ్వర్యంలో సహకార సంఘాల సీఈవోలకు నానోయూరియా, నానో డీఏపీపై అవగా హన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమా నికి జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాల మాట్లా డుతూ రైతులు పంట పొలాల్లో ఒకరికి మించి మరొ కరు యూరియా వాడకాన్ని అధికం చేశారని, దీని వల్ల యూరియా కొరత ఏర్పడుతుందన్నారు. ఎకరా నికి పంట పూర్తయ్యే వరకు కేవలం రెండు బస్తాలు మాత్రమే వాడాలని, కాని నాలుగు బస్తాలు వాడుతు న్నారని, దీనివల్ల పొలాల్లో అనేక రోగాలు వస్తున్నాయ న్నారు. యూరియా కొరత నివారించేందుకు నానో యూరియాను వినియోగించాలన్నారు. ఇఫ్కో జిల్లా మేనేజర్ బాలాజీ, స్టోర్ యజమాని సతీస్, జిల్లాలోని సహకార సంఘాల సీఈవోలు పాల్గొన్నారు.
ఓదెల, (ఆంధ్రజ్యోతి): పంటలు పూర్తయిన తర్వాత భూములను లోతుగా దుక్కులు దున్నుకుంటే చీడ,పీడల పురుగుల ఉధృతి తగ్గుముఖం పడుతుం దని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), వ్యవసాయ శాఖ, కరీంనగర్ తెలం గాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష ఆధారిత ఎరు వుల వినియోగం, బీటీ 3 పత్తి విత్తనాల వలన కలిగే నష్టాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల వేసుకోవాలన్నారు.
అధిక రసాయన ఎరు వుల వినియోగం వల్ల పురుగుల ఉధృతి ఎక్కువ అవుతుందని తెలిపారు. ఏడిఎ శ్రీనాథ్ మాట్లాడుతూ, రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ సాగులో మెళకువలు నేర్చుకోవాలని, దీంతో అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. సర్పంచ్ కనికిరెడ్డి సతీ్‌ష్, పెద్దపల్లి డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనాథ్, మండల ఏఓ భాస్కర్, ఏఈఓలు పాల్గొన్నారు.
ముత్తారం, (ఆంధ్రజ్యోతి): కూరగాయల విత్తనా లతో సాగును లాభసాటిగా మార్చుకోవాలని హరిపు రం సర్పంచ్ మెంగని సమత తిరుపతి సూచించారు. హరిపురంలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు. హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (హెచ్‌ఈవో) రాజశేఖర్ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల ఎంపి కతోనే అధిక దిగుబడి సాధ్యమని వివరించారు. కార్యదర్శి నవ్య, వార్డు సభ్యులు ఏజ్జ లత తిరుపతి, రామంచ స్వరూప, రాజేష్, రైతులు పాల్గొన్నారు.
పాలకుర్తి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతువేదికలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ) ద్వారా రైతులకు నూతన సాంకేతి కతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కెవికె రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తల బృందం రైతులకు వివిధ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు శశిధర్, ఏఈవో యోజన, వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమా ర్, ఈసాలతక్కళ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్, శాస్త్రవేత్తలు డా.పి కిరణ్,వై వెంకన్న,టి వినోద్ పాల్గొన్నారు.