Share News

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:57 PM

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా నూగిళ్ళ మల్లయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కార్యాలయంలోని రూం నంబర్‌ 207ను ముస్తాబు చేశా రు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌

పెద్దపల్లి, టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా నూగిళ్ళ మల్లయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ కార్యాలయంలోని రూం నంబర్‌ 207ను ముస్తాబు చేశా రు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లయ్యను ఘనంగా సన్మానించారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్నారు. పట్టణ నాయకులు, కార్యకర్తలు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ పట్టణ ప్రజల, కౌన్సిలర్ల సహకారంతో పట్టణ సమస్యలు పరిష్కరించడంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పట్టణాన్ని సుందరంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కాన్‌ నాజ్‌, కౌన్సిలర్లు, దొడ్డుపెల్లి జగదష్‌, నాంసాని శ్రీనివాస్‌, మంథెన నర్సింగ్‌, పాగాల శ్రీకాంత్‌, తోట ఫణిందర్‌, దేవనంది రమాదేవి, మోలుగూరి కమల్‌, కొమ్ము సుధాకర్‌, సుద్దమల్ల అమ్రీష్‌, కొలిపాక సంపత్‌, నాయకులు భూతగడ్డ సంపత్‌ బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:57 PM