Share News

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:56 PM

వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అరైవ్‌, అలైవ్‌ రోడ్డు భధ్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

కోల్‌సిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అరైవ్‌, అలైవ్‌ రోడ్డు భధ్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్‌ ధరించి వాహనదారులకు సీపీ పుష్పాలు అందించి అభినందించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్‌ పంపిణీ చేసి భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. సీపీ మాట్లాడుతూ హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే పోలీసులు చలాన్లు విధిస్తారన్నారు. ప్రమాదం జరిగితే గాయాలు, ప్రాణనష్టం జరిగి మీకు, మీ కుటుంబానికి నష్టం జరుగుతుందన్నారు. ఇంటి నుంచి వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి హెల్మెట్‌ ధరించాలన్నారు. హెల్మెట్‌ ధరించి, సేఫ్టీ లాక్‌ బిగించుకుని వాహనం నడుపాలన్నారు. పెద్దపల్లి డీసీపీ డీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, పెద్దపల్లి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అనీల్‌ కుమార్‌, మంచిర్యాల ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ హరి శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:56 PM