Share News

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:10 AM

ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద రోడ్డు భధ్రత వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. అరైవ్‌, అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద రోడ్డు భధ్రత వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. రోడ్డు భద్రత పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం ప్రజలు, ఆటో డ్రైవర్లు, మహిళలతో రహదారి భద్రతపై ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, మేయర్‌ మహంకాళి స్వామి, సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, కమిషనర్‌ అరుణశ్రీ, ఏసీపీలు రమేష్‌, శ్రీనివాస్‌, గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌, అనూష, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:10 AM