పదవితో ప్రజలకు మరింత సేవ
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:12 AM
పదవితో ప్రజలకు మరింత సేవ చేస్తానని, తాను ఆశించి తెచ్చుకోలేదని ప్రభుత్వ విప్ చిం తకుంట విజయరమణారావు తెలిపారు. విప్ పదవి అనంతరం పెద్దపల్లికి వచ్చిన విజయర మణారావును దుబ్బపల్లి నుంచి పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు ర్యాలీగా తీసుకువచ్చారు.
పెద్దపల్లిటౌన్, (ఆంధ్రజ్యోతి): పదవితో ప్రజలకు మరింత సేవ చేస్తానని, తాను ఆశించి తెచ్చుకోలేదని ప్రభుత్వ విప్ చిం తకుంట విజయరమణారావు తెలిపారు. విప్ పదవి అనంతరం పెద్దపల్లికి వచ్చిన విజయర మణారావును దుబ్బపల్లి నుంచి పెద్దపల్లి జెండా చౌరస్తా వరకు ర్యాలీగా తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పదవి గతంలో ముకుందరెడ్డికి రాగా 30 ఏళ్ళ తరు వాత తనకే వచ్చిందన్నారు. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచానని, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు చేపట్టినట్లు తెలిపారు. 2009లో మహా కూటమిలో ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు వివరించారు. తనను బీఆర్‌ఎస్ పార్టీలో ఎన్నో సార్లు ఆహ్వానించినా ఒప్పు కోలేదన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికి ఓటమి పాలయ్యానన్నారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే తాను అనుచర గణంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. 2018లో స్వల్ప మెజార్టీతో ఓడిపో యానని, రేవంత్‌రెడ్డి వెంటే ఉంటే 2023లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజర్టీతో నియోజకవర్గ ప్రజలు గెలి పించారన్నారు. గెలిచిన రెండేళ్ళలో 1350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ చైర్మన్లు నూగిళ్ళ మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, మందల సత్యనా రాయ ణరెడ్డి, గోపగాని సారయ్య గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్‌రావు, ముస్కాన్ నాజ్, సయ్యద్ మస్రత్ చీకట్ల మెండయ్య, ప్రైమ్ సాగర్ తదితరులున్నారు.