మోదీ పాలన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దింది
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:29 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, విధానపరమైన స్తబ్దతతో ఉన్న దేశాన్ని నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
పెద్దపల్లి టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, విధానపరమైన స్తబ్దతతో ఉన్న దేశాన్ని నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని తెలిపారు. యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పిస్తూ స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది యువకులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశీయ ఆయుధాల తయారీ పెరిగి ఆయుధాల ఎగుమతి దేశంగా ఎదిగిందన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కొత్త గుర్తింపు లభించిందన్నారు. అంతరిక్ష రంగంలో చంద్రయాన్, గగన్‌యాన్ వంటి విజయాలతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. జిల్లా కన్వీనర్ శివంగారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు అమరాగాని ప్రదీప్ కుమార్, దాడి సంతోష్, కందుల శ్రీనివాస్, బెజ్జంకి దిలీప్, రామగిరి అఖిల్, బుతాగడ్డ రాజ్ కుమార్, రాజేందర్ రెడ్డి, పెంజర్ల ఐలయ్య, రగుల రాజ్ కుమార్ పార్టీ నాయకులు యువమోర్చ ప్రతినిధులు పాల్గొన్నారు.