Share News

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:04 AM

మైనింగ్‌ భద్రతలో ఆధునిక సాంకే తికతను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ టీఆర్‌ కన్నన్‌ అన్నా రు. 55వ జోనల్‌ రెస్య్కూ పోటీల ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి ఎన్‌సీఓఏ క్లబ్‌ రెస్క్యూస్టేషన్‌లో జరిగింది.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 24 (ఆం ధ్రజ్యోతి): మైనింగ్‌ భద్రతలో ఆధునిక సాంకే తికతను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ టీఆర్‌ కన్నన్‌ అన్నా రు. 55వ జోనల్‌ రెస్య్కూ పోటీల ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి ఎన్‌సీఓఏ క్లబ్‌ రెస్క్యూస్టేషన్‌లో జరిగింది. మైనింగ్‌ రంగంలో ఎప్పుడు ఏప్రమాదం పొంచి ఉందో తెలియని స్థితి ఉంటుందని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆధునిక పనిముట్లు, యం త్రాలు, సాంకేతికతను వినియోగించుకుని రెస్క్యూను బలోపేతం చేసుకునే అవకాశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యం గల బ్రిడేడియర్లతో ప్రమాదరహిత సింగరేణి సాధ్యమన్నారు. డైరెక్టర్‌(పీపీ) వెంక టేశ్వర్లు, డీఎంఎస్‌ అధికారులు సాగేష్‌కుమార్‌, అశోక్‌ కుమార్‌, రాజ్‌కిషోర్‌ సింగ్‌, సత్యనారా యణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామ య్య, ఐఎన్‌టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ధర్మపురి, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, ఆర్జీ-2 జీఎం లక్ష్మీపతిగౌడ్‌, జీఎంలు పాల్గొన్నారు.

రెస్క్యూ పోటీల విజేత ఆర్జీ-2,3 జట్టు

55వ జోనల్‌ రెస్య్కూ పోటీల విజేతగా ఆర్జీ-2,3 ఏపీఏ జట్టు నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చి ఆర్జీ-2,3, ఏపీఏ జట్టు ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచి ప్రథమ బహుమతి సాధించింది. ఆర్జీ-1 ద్వితీయ స్థానంలో నిలవగా, తృతీయస్థానంలో శ్రీరాంపూర్‌ జట్టు నిలిచింది. మహిళా జట్లలో సింగరేణి స్మార్ట్‌-1 జట్టు ప్రథమ స్థానం సాధించింది. మెటల్‌ మైనింగ్‌ కంపెనీల్లో యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రథమ స్థానం సాధించింది.

విభాగాల వారీగా ...

రెస్క్యూ రిలేలో సింగరేణి మహిళా ఏ జట్టు ప్రథమ, ద్వితీయలో ఆర్జీ-2,3 ఏపీఏ జట్టు, తృతీయలో కొత్తగూడెం మణుగూరు జట్టు నిలిచాయి. రెస్క్యూ రిలేలో సింగరేణి మహిళా జట్టు-బీ ప్రథమ, ఫస్ట్‌ ఎయిడ్‌ స్టాట్యుటరీ థియరీలో అట్టిగోల్డ్‌మైన్స్‌ ప్రథమ, బెస్ట్‌ ఇన్‌ స్టాట్యుటరీ మందమర్రి, బెల్లంపల్లి జట్టు, బెస్ట్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ విభాగంలో శ్రీరాంపూర్‌ జట్టు ప్రథమ స్థానం సాధించాయి. ఫస్ట్‌ ఎయిడ్‌ బేస్‌ రెస్క్యూ రికవరీ విభాగంలో సింగరేణి మహిళా జట్టు-ఏ ప్రథమ స్థానం సాధించింది.

Updated Date - Sep 25 , 2026 | 12:04 AM