మాక్ పార్లమెంటరీ పోటీలు విజయవంతం
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:56 PM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు సోమవారం పీఎంశ్రీ జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలు విజయవంతంగా జరిగాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా లక్ష్యమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మార్చి16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు సోమవారం పీఎంశ్రీ జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలు విజయవంతంగా జరిగాయి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్ ఫర్ ఇండియా లక్ష్యమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ అన్నారు. సోమవారం జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో భాషా నైపు ణ్యాలు, జనరల్ నాలెడ్జ్, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన పెంచేందుకు పోటీలు దోహదపడుతాయని ఆయన తెలి పారు. ఈ పోటీల్లో స్టోరీ టెల్లింగ్, ఆంగ్లం స్పెల్ బీ, జనరల్ నాలెడ్జ్ పోటీలు, మాక్ పార్లమెంట్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఆర్గనైజర్లుగా గడ్డం జగ దీశ్వర్, కిరణ్, రవి, ప్రభాకర్ రెడ్డి, దేవెందర్ రెడ్డి, పుష్పలత, కృష్ణారెడ్డి, అశోక్‌లతోపాటు జడ్జిలుగా ఇందిర, జరీనా, రమాదేవిలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారిలో ప్రాథమిక స్థాయిలో రత్నా పూర్ ఎంపీపీఎస్ విద్యార్థిని స్వాతిక, గర్రెపల్లి నుంచి మహేష్, సెకండరీ స్థాయిలో మల్లాపూర్ గురుకులం నుంచి అంజన సౌమ్య, మంథని నుంచి తరుణ్, పారుపల్లి ఎంపీపీఎస్ నుంచి ఆకాంక్ష, గర్రెపల్లి ఎంపీపీఎస్ నుం చి సాయికిరణ్, జీకె టెస్ట్‌లో పారుపల్లి నుంచి వర్షిత్, గర్రెపల్లి నుంచి షయెర, సెకండరీ స్థాయిలో కమాన్‌పూర్ జడ్పీ విద్యార్థిని రవిత్రేయిని, మంథని శ్రీహర్షిత్ కుమార్ రామ్ విద్యార్థులు విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు.