ఉపాధిహామీ కూలీలతో ఎమ్మెల్యే ముఖాముఖి
ABN , Publish Date - May 19 , 2026 | 11:58 PM
కుక్కలగూడూర్‌లో మంళవారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఉపాఽధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను పరిశీ లించారు.
పాలకుర్తి, మే 19 (ఆంధ్రజ్యోతి): కుక్కలగూడూర్‌లో మంళవారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఉపాఽధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను పరిశీ లించారు. కూలీలు తమకు ఎదురవుతున్న పలు ఇబ్బం దులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాల కల్పనపై చర్చించారు. నీడ కొరకు టెంట్లు, తాగునీటి వసతి, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కూలీలకు రావాల్సిన బకాయిలు, వారంతపు వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉద యం వేళల్లోనే పనులు త్వరగా పూర్తయ్యేలా సమ యాలను సర్దుబాటు చేయాలని కోరారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికులు, కూలీల సంక్షేమా నికి కట్టుబడి ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు. ఎంపీడీవో పొల్సాని శశికళ, సర్పంచ్ మేడం దేవమ్మ బాపు, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్, ఎంపీవో ఉప్పు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షుడు ముక్కెర శ్రీనివాస్,సర్పంచ్‌లు కిరణ్, తోట ప్రశాంత్,నాయకులు సూర సమ్మయ్య, సురేష్, తదితరులున్నారు.
ఎక్లాస్‌పూర్‌కు బస్సు ప్రారంభం
అంతర్గాం, మే19(ఆంధ్రజ్యోతి): పల్లెలకు ఆర్టీసీ బస్సులు రావడంతో విద్యార్థులకు, గ్రామస్తులకు ప్రయాణం సులభ అవుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. ఎక్లాస్‌పూర్ గ్రామానికి కొన్నేళ్లుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులను ఒప్పించారు. మంగళవారం గ్రామానికి బస్సు కేటాయించడంతో ఎమ్మెల్యే బస్సును నడిపి ప్రారంభించారు. గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని ఉపాధిహామీ కూలీలను కలిసి పలు సమస్యలపై చర్చించి, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్, నాయకులు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.