సర్‌పై అపోహలు వీడాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:43 PM
ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్‌వోలకు వివరాలు అందించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం నిట్టూరులో చేపడు తున్న ఎస్‌ఐఆర్ సర్వేను పరిశీలించారు.
పెద్దపలిరూరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగిపోతాయనే అపోహలను ప్రజలు నమ్మవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే బీఎల్‌వోలకు వివరాలు అందించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. గురువారం నిట్టూరులో చేపడు తున్న ఎస్‌ఐఆర్ సర్వేను పరిశీలించారు. ఆర్డీవో బిఎల్‌వోలు వివరాలు సేకరిస్తున్న ప్రక్రియను తెలుసుకున్నారు. ఆర్డీవో గంగ య్య మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పార దర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలన్నారు. ఓటర్ల జాబితా లోని లోపాలు సరిదిద్దడంతో పాటు మరణిం చిన, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ డూప్లి కేట్ ఓట్లను తొలగించేందుకు అస్కారం ఉం టుందన్నారు. అక్టోబరు 2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును తుది జాబితాలో చేర్చేలా చూస్తామన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తీసు కోవడంతో పాటు వాటిని పూర్తి చేసి సకాలంలో బిఎల్‌వోలకు అందిం చాలని సూచించారు. తహసీల్దార్ రాజయ్య, డిప్యూటి తహసీల్దార్ విజేందర్, బిఎల్‌వోలు పాల్గొన్నారు.
మంథని, (ఆంధ్ర జ్యోతి): మంథని మున్సిపాలిటి పరి ధిలోని 2, 13 వార్డులలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని గురువారం ఆర్డ్డీవో కన్నబో యిన సురేష్, తహసీల్దార్ అరీఫొద్దీన్, మున్సి పల్ కమిషనర్ ఎన్, మనోహర్‌లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శ కంగా నిర్వహించాలని బీఎల్‌వోలకు సూచన లు జారీ చేశారు. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపుల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.