నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:46 PM
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం జిల్లాలో పర్యటించను న్నారు. సుల్తానాబాద్, మంథని వద్ద బహి రంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నా యి. రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధిపనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నా యి.
పెద్దపల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐదుగురు మంత్రులు బుధవారం జిల్లాలో పర్యటించను న్నారు. సుల్తానాబాద్, మంథని వద్ద బహి రంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నా యి. రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ. 387.32 కోట్ల విలువైన అభివృద్ధిపనులకు శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నా యి. మంథని నియోజకవర్గంలో రూ.164.64 కోట్లు, పెద్దపల్లి నియోజకవర్గంలోరూ.222.68 కోట్లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టను న్నారు. ఈ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటుండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
మంథనిలో
మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టనున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రూ.164.64 కోట్లతో వివిధ రహ దారుల పనులకు శంకుస్థాపన చేయను న్నారు. బ్రిడ్జి రోడ్డు నుంచి బస్‌డిపో వరకు వెడల్పు, డ్రెయిన్‌కు రూ.15 కోట్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.1.20 కోట్లు, గాంధీచౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు విస్తరణ, సెం ట్రల్ లైటింగ్‌కు రూ. 59 లక్షలు, అంబేద్కర్ చౌక్ నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు రూ. 35 లక్షలు కేటాయిం చారు. మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు రూ.21 కోట్లు, డిపో నుంచి గోదావరి వరకు రెండు కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డుకు రూ.21 కోట్లు, సూరయ్యపల్లి- కాకర్లపల్లి-సీతంపేట రోడ్డు విస్తర ణకు రూ.22 కోట్లు, గుంజపడుగు- ఉప్పట్ల- విలోచ వరం రోడ్డుకు రూ.8.78 కోట్లు, ముత్తారం-కూనారం రోడ్డుకు రూ.36.28 కోట్లతో పనులు చేపట్టనున్నారు. సీఎస్‌ఆర్ నిధులతో తొమ్మిది గ్రామాలకు వైకుంఠ రథాలను అందించనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘా లకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.
పెద్దపల్లిలో
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నాయకత్వంలో రూ. 222.68 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆరు బీటీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.183.33 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు రూ.99.69 కోట్లు, సుల్తానా బాద్ నుంచి పెద్దపూర్ వరకు రూ.44.35 కోట్లు, సుల్తానాబాద్- కాల్వశ్రీరాంపూర్ రోడ్డుకు రూ.7.35 కోట్లు, గంగారం- పందిళ్ల రోడ్డుకు రూ.17 కోట్లు, మేడా రం నుంచి జూలపల్లి మండల కేంద్రం వరకు రోడ్డుకు రూ.15 కోట్లు కేటాయించారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో రైతుల అవసరాల కోసం రాష్ట్ర గిడ్డంగుల శాఖ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో రూ.39.35 కోట్లతో గోదాములు నిర్మించనున్నారు.