17న సుల్తానాబాద్‌లో మంత్రుల పర్యటన
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:16 AM
సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు.
సుల్తానాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ లో ఈనెల 17న రూ.250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రుల చేతులమీదుగా శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పాల్గొని శంకుస్థాపనలు చేయ నున్నట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక వైశ్యా భవన్‌లో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతు గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు గర్రెపల్లి నుంచి ఓదెల మండలంలోని గ్రామాల గుండా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డబల్ బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. అలాగే రూ.42 కోట్లతో సుల్తానాబాద్ నుంచి జూలపల్లి మండలం పెద్దా పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం, రూ.32 కోట్లతో కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం, మంగపేట చౌరస్తా నుంచి ముత్తారం మండల కేంద్రం వరకూ రోడ్డు నిర్మాణం, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, పూసాల చౌరస్తా లలో సెంట్రల్ లైటింగ్ సిస్టిం ఏర్పాట్లు జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాక్రిష్ణ, ఊట్ల వరప్రదీప్, నాయకులు పన్నాల రాములు, రాజలింగం, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్, అమిరిశెట్టి తిరుపతి, గాజుల హరీష్, అమీనొద్దిన్, ఫరూఖ్, మోబిన్, సర్పంచులు కాంపల్లి సతీష్ కుమార్, నామిని రాజిరెడ్డి, సంపత్ రెడ్డి, కోదాటి సాయికిర ణ్, పోచం, కౌన్సిలర్లు రాజు, గరిగె శ్రీనివాస్, రవీందర్ రఫీ కిషోర్ ఈర్ల శేఖర్ పాల్గొన్నారు.