రామగుండంలో నేడు మంత్రుల పర్యటన
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:43 PM
రామ గుండంలో ఆదివారం ముగ్గురు మంత్రులు పర్య టించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరి శ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
గోదావరిఖని, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రామ గుండంలో ఆదివారం ముగ్గురు మంత్రులు పర్య టించనున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పరి శ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మం త్రి శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదా నంలో సభ ఏర్పాటు చేశారు. ఇక్కడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను పంపిణీ చేయనున్నారు. రామగుం డం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించి 633 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేస్తారు. కార్పొరేషన్ పరిధిలో ఇంటి స్థలాలు ఉన్న 491 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా లకు సంబంధించి ప్రొసీడింగ్‌లు అందజేస్తారు. 576మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వనున్నారు. ఎస్‌టీపీపీ నిర్వాసితులు, పేదలకు నర్రశాలపల్లి, పాములపేట గోదావరి వరద నిర్వాసితులకు హౌసింగ్ బోర్డు వద్ద, 31మంది ట్రాన్స్‌జెండర్లకు గౌతమినగర్ సమీపంలో ఇంటి స్థలాలకు ప్రొసీ డింగ్‌లు పంపిణీ చేస్తారు. యాజమాన్య హక్కులు లేని మారేడుపాక సింగరేణి నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో యాజమాన్య హక్కులకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు రూ.182కోట్లతో చేపట్టనున్న అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.50కోట్ల యూఐడీఎఫ్ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, రూ.30 డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, జూనియర్ కళాశాల మైదానంలో మోడల్ పాఠ శాల నిర్మాణ పనులు, రూ.88కోట్లతో కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 8ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ పనులు, రామగుండం మసీదు కార్నర్ నుంచి లింగాపూర్ వరకు రూ.6కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు. కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్, కార్పొరేషన్ ఇన్ చార్జి కమిషనర్ అరుణశ్రీ హాజరుకానున్నారు. సభాస్థలి వద్దే పంపిణీ చేసేందుకు స్టాళ్లను ఏర్పాటుచేశారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ శనివారం గోదావరిఖని జూనియర్ కళాశాల మైదానంలో మంత్రుల సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కార్పొరేషన్ అధికా రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు సూచ నలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
కట్టుదిట్టమైన భద్రత
కోల్‌సిటీ, (ఆంధ్ర జ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో నిర్వహించనున్న బహిరంగ సభకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటున్న నేపథ్యంలో గోదావరిఖనిలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. శనివారం గోదా వరిఖని దుర్గానగర్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్‌హాలో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణంలో వేదిక, పబ్లిక్ గ్యాలరీ వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్టు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భధ్రతల పరిరక్షణ, హెలీప్యాడ్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని, సభా ప్రశాంతంగా జరిగేలా విధి నిర్వహణలో ప్రతి ఒక్క పోలీస్ బాధ్యతగా ఉండాలన్నారు. ఏఆర్ ఏసీపీ ప్రతాప్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, సీఐ-2 రవీందర్, గోదావరిఖని టుటౌన్ సీఐ ప్రసా ద్‌రావు, లింగమూర్తి, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, మంథని సీఐ రాజు, ట్రాఫిక్ సీఐ రాజేశ్వ ర్‌రావు, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.