Share News

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:05 AM

సింగరేణిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాల జీఓలోని బీ కేటగిరి వేతనాలను చెల్లించా లని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌ డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి

గోదావరిఖని, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పనిచేస్తున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాల జీఓలోని బీ కేటగిరి వేతనాలను చెల్లించా లని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సింగరేణి జీడీకే 1సీఎస్‌పీలోని పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఏఐటీయూసీలో చేరగా యూనియన్‌లోకి ఆహ్వానించారు. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు కొన్నేళ్లుగా చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకో వడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు వేత నాలు పెంచుతామని, పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కాం ట్రాక్టు కార్మికులను పట్టించుకోకుండా ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సింగరేణి ఏరియాలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం సీ గ్రేడ్‌ వేతనాలు ఇస్తున్నారని, బీ గ్రేడ్‌ వేతనాలు చెల్లించేం దుకు ఆ జీవోను అమలు చేయాలని యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య వినతిపత్రం ఇచ్చారన్నారు. సీఎస్‌పీ-1 కాంట్రాక్టు వర్కర్స్‌ ఏఐటీయూసీ ఇన్‌చార్జిగా కే వెంకటేష్‌ను నియమించారు. నాయకులు ఎంఏ గౌస్‌, రంగు శ్రీను, బీ సమ్మయ్య, జానిమియాతో పాటు కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:05 AM