Share News

కనీస వేతనాల జీవోలను సవరించాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:53 PM

పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించే జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరించి కనీస వేతనం నెలకు 42 వేలు నిర్ణయించాలని సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు.

  కనీస వేతనాల జీవోలను సవరించాలి

పెద్దపల్లి రూరల్‌ , నవంబరు 6 (ఆంరఽధజ్యోతి) : పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించే జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరించి కనీస వేతనం నెలకు 42 వేలు నిర్ణయించాలని సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్స్‌ వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన సమావేవవ నిర్వహించారు. ఈనెల 10న జరిగే కాంట్రాక్టు కార్మికుల చలో హైదరాబాద్‌ కరపత్రాలను ఆవిష్కరించారు, ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కార్మికులకు పిఎఫ్‌, బోనస్‌, ఈఎస్‌ఐ పై ఉన్న సీలింగ్‌ ఎత్తివేయాలని సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ధర్నాకు జిల్లాలోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఎన్‌, బిక్షపతి, ఎం, రామాచారి, సిపెల్లి రవీందర్‌, తాండ్ర అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:53 PM