Share News

ఆర్‌జీ-2లో మైన్‌క్లోజర్‌ వెరిఫికేషన్‌ పూర్తి

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:43 AM

సింగరేణి ఆర్‌జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో ఆర్‌జీ ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రోగ్రెసివ్‌ మైన్‌ క్లోజర్‌ పరిశీలనలో భాగంగా థర్ట్‌ పార్టీ వెరిఫికేషన్‌ శనివారం పూర్తయింది.

ఆర్‌జీ-2లో మైన్‌క్లోజర్‌ వెరిఫికేషన్‌ పూర్తి

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆర్‌జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో ఆర్‌జీ ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రోగ్రెసివ్‌ మైన్‌ క్లోజర్‌ పరిశీలనలో భాగంగా థర్ట్‌ పార్టీ వెరిఫికేషన్‌ శనివారం పూర్తయింది. గని మూసివేత సమయంలో పర్యావరణ పున రుద్ధరణకు కేటాయించిన ఎస్ర్కో నిధులను విత్‌ డ్రా చేసుకునేందుకు స్వతంత్ర సంస్థ ద్వారా వెరిఫికేషన్‌ తప్పనిసరి. ఇందులో భాగంగా ప్రతి ష్టాత్మక విద్యా సంస్థ ఐఐఈఎస్‌టీ, షిబ్‌పూర్‌ చెందిన ప్రొఫెసర్‌ గంగోపా ధ్యాయను థర్డ్‌పార్టీ అబ్జర్వర్‌గా నియమించగా ఆయన శనివారం గనిని సందర్శించారు. గాలి నాణ్యత నియంత్రణ చర్యలు, నీటి నాణ్యత యాజ మాన్యం, మైనింగ్‌ వల్ల ఏర్పడిన భూమి కుంగుబాటు ప్రాంతాల పునరు ద్ధరణ, విస్తృతంగా చేపట్టిన హరితహారం ప్లాంటేషన్‌ కార్యక్రమాలను పరిశీలించారు. యువతకు కల్పిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణా కార్యక్రమాల పనితీరును తెలుసుకున్నారు. గని ఏజెంట్‌ విజయ్‌ కుమార్‌, మేనేజర్‌ మల్లేశం, ఏరియా ఎన్విరాన్‌మెంట్‌ అధికారి వేణుకుమార్‌, కార్పొరేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ అధికారులు వీ తిరుపతి, టీ శంకర్‌, ప్రాజెక్ట్‌ ప్లానింగ్‌ విభాగానికి చెందిన రవీంద్రనాథ్‌, పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): ఆర్జీ-3,ఏపిఏ డివిజన్‌లలో ఇండియన్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌ గం గోపాధ్యాయ పర్యటించారు. జీఎం మధుసూదన్‌, నాగేశ్వర్‌రావులతో సమావేశం నిర్వహించారు. రామగుండం కోల్‌మైన్‌ క్లోజర్‌ యాక్టివిటీస్‌ కింద ఓసిపి-1,2 గనులతో పాటు ఏఎల్‌పి, 10 ఇంక్లైయిన్‌, వకీల్‌ పల్లి గనులను సందర్శించి పర్యావరణ చర్యలను పరిశీలించారు. కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. అధికారులు రామ్మోహన్‌, రాజశేఖర్‌, రావుల పాపయ్య, భరత్‌కుమార్‌, కిషన్‌, ప్రశాంత్‌జీవన్‌, రవీంద్రనాథ్‌, తిరుపతి, శంకర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:43 AM