మెడికల్ షాపుల బంద్ విజయవంతం
ABN , Publish Date - May 20 , 2026 | 11:39 PM
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ కెమిస్ట్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులను బంద్ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్ చేశారు.
పెద్దపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ కెమిస్ట్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులను బంద్ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్ చేశారు. అపోలో, మెడ్‌ప్లస్ వంటి షాపులను మొదట బంద్ చేయనప్పటికీ, మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేశారు. పెద్దపల్లి పట్టణంలో సుమారు 120 షాపులు ఉండగా, అన్నింటిని బంద్ చేసి సాయంత్రం 6 గంటలకు తెరి చారు. ఈ సందర్భంగా కెమిస్టు అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్‌లో మందులను విక్రయించేందుకు తీసుక వచ్చిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా డూప్లికేట్ మందులను విక్రయిస్తూ మోసం చేస్తున్నారని, నార్కొటిక్స్ డ్రగ్స్ వంటి వాటిని కూడా ఆన్ లైన్‌లో విక్రయిస్తూ యువతను నాశనం చేస్తు న్నారన్నారు. డూప్లికేట్ మందుల విక్రయాల వల్ల బీపీ, షుగర్‌తో బాఽధపడుతున్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ మందుల వల్ల బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండడం లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ఆన్‌లైన్‌లో మందు లను విక్రయాలను నిలిపి వేయాలన్నారు.