Share News

చెంచు కుటుంబాల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:10 AM

చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్‌ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్‌ చొరవతో అధికారులు అందించారు.

చెంచు కుటుంబాల అభివృద్ధికి చర్యలు

ముత్తారం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్‌ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్‌ చొరవతో అధికారులు అందించారు. మండల పరిషత్‌ పైమ్రరీ స్కూల్లో కలెక్టర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు అడ్మిషన్లు అందించారు. అర్హులైన చెంచు కుటుంబాలకు కలెక్టర్‌ ప్రత్యేక నిధుల ద్వారా షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. చెంచు కుటుంబాల కోసం ఇప్పటికే నిర్మించిన గృహాలను పరిశీ లించిన కలెక్టర్‌, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ధర్యాపూర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్‌, పాఠశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని లెవెలింగ్‌ చేసి విద్యా అవసరాలకు అనుగుణంగా విని యోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్‌ మధుసూదన్‌ రెడ్డి, ఎంపీడీవో సురేష్‌, డిఈలుపాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:10 AM