Share News

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:50 PM

సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే వేడుకల్లో అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సోషల్‌ జస్టిస్‌ డే వేడుకల్లో అదనపు కలెక్టర్‌ వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభ్వుం కేబినెట్‌ కుల సర్వే నిర్వహణ, ఎస్సీ కుల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యేటా క్యాబినెట్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఫిబ్రవరి 4న సోషల్‌ జస్టిస్‌ రోజుగా జరుపుకుంటున్నామని ఆయన వివరించారు. సమాజంలో రావాల్సిన సామాజిక మార్పులపై చర్చిస్తామని, ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని భవిష్యత్‌లో మరింత మెరుగ్గా సోషల్‌ జస్టిస్‌ డే నిర్వహిస్తామన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడానికి మరోసారి కంకణబద్దులై ముందుకు సాగేలా అధికార యంత్రాంగానికి సోషల్‌ జస్టిస్‌ డే ప్రేరేపితం కావాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్‌, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌, జిల్లా బీసీ అబివృద్ధి అధికారి రంగారెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ ప్రకాష్‌తోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:50 PM