ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:43 PM
ఓదెల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ నిర్మాణానికి రూ,15 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు.
ఓదెల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఓదెల భ్రమ రాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పునరుద్ధరణ నిర్మాణానికి రూ,15 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని దేవాదా య, ధర్మదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులను విజయ రమణారావు, చైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డితో కలిసి నమూనా చిత్ర పటాన్ని ఉన్నతాధికారులు, స్థపతి వల్లి నాయగన్ కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు నిధులను కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి రూ.ఐదు కోట్లను కేటాయించారు. ఆల యానికి భారీగా నిధులు కేటాయింపుతో రాష్ట్రంలోనే ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం సంతరించనుంది. అర్నాటెక్స్ ఇంజనీర్‌తో పాటు ఈవో సదయ్య, జూనియర్ అసిస్టెంట్ ముద్ద సాని కుమారస్వామి, ఆలయ ముఖ్య అర్చకుడు వీరభద్రయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.