కార్మికుల సమస్యలపై యాజమాన్యం సానుకూలం
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:04 AM
సింగరేణిలోని కార్మికుల సమస్యలపై యాజ మాన్యం స్పందించిందని, సమ్మె నోటీసులోని 24సమస్యలపై యాజమాన్యంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు.
గోదావరిఖని, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని కార్మికుల సమస్యలపై యాజ మాన్యం స్పందించిందని, సమ్మె నోటీసులోని 24సమస్యలపై యాజమాన్యంతో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ చెప్పారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 31 సమస్యలపై యాజ మాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వగా, అందులో 24 డిమాండ్లను యాజమాన్యం పరిష్క రించిందని, మిగిలిన డిమాండ్లపై త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో జూన్ 8న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వగా పలు మార్లు చర్చల అనంతరం 24డిమాండ్లపై ఒప్పందం జరిగిందన్నారు. ఇందులో ప్రధా నంగా పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్ యాజమాన్యం భరించేందుకు అంగీకరించిందన్నారు. సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20లక్షలు, ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహిస్తామని చెప్పిందన్నారు. 2025-26 వాస్తవ లాభాలను ప్రకటించి దసరా పండుగకు కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేస్తామని తెలిపిందన్నారు. ట్రాన్స్‌ఫర్‌లలో మూడు సంవత్సరాల నిబంధ నను తొలగించిందని, సీనియర్ మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్‌మెన్ ప్రమోషన్లు ఇవ్వడానికి, మారుపేర్ల సమస్య పరిష్కారానికి కమిటీ వేయడానికి అంగీకరించిందన్నారు. హైదరా బాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సింగరేణి ఒప్పుకున్న దని, మెడికల్ అటెండెన్స్ రూల్స్‌లో మార్పులు చేసేందుకు, దిగిపోయిన కార్మికులకు వారం రోజుల చికిత్స కల్పించేందుకు, సింగరేణి విద్యా సంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. భద్రత సామాగ్రి సకాలంలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిందని, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న బొగ్గుగని కార్మికులకు 9శాతం హెచ్‌ఆర్‌ఏను ఇస్తామని ఒప్పుకుందన్నారు. డిస్మిస్ కార్మికుల పెండింగ్ కేసుల పరిష్కారం, మైనింగ్ స్టాఫ్‌కు సుటబుల్ జాబ్, కాంట్రాక్టు కార్మికులందరికి ఈఎస్‌ఐ వైద్యం, డిపెండెంట్ ఉద్యోగాల పెండింగ్ కేసుల పరిష్కారం లాంటి డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.
ఉద్యోగులకు ఈవినింగ్ కాలేజీలకు అనుమతి, ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్ స్కీమ్‌ల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి హామీ ఇచ్చిందన్నారు. సొంత ఇంటి పథకంపై ప్రభుత్వంతో చర్చించేందుకు అంగీకరించిందని, చట్టబద్దమైన సమ్మెలో కార్మికులు పాల్గొంటే నో వర్క్, నో పే అమలు చేస్తామని, వీరికి జరిమానాలు వర్తింప చేయమని ఒప్పుకున్నదన్నారు. విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య, సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, నర్సింగరావు, పెద్దెల్లి శంకర్, కనకరాజు, చేరాలు, తొడుపునూరి రమేష్, మల్లేష్, దేవయ్య, కొమురయ్య పాల్గొన్నారు.