Share News

క్రీడలకు సమయం కేటాయించాలి

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:00 AM

క్రీడలకు, వ్యాయామానికి రోజుకు ఒక గంట సమయం కేటాయించాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి సురేష్‌ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్‌లో మూడు రోజుల క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

క్రీడలకు సమయం కేటాయించాలి

సుల్తానాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): క్రీడలకు, వ్యాయామానికి రోజుకు ఒక గంట సమయం కేటాయించాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి సురేష్‌ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సుల్తానాబాద్‌లో మూడు రోజుల క్రీడల నిర్వహణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాల మేరకు జిల్లా క్రీడల యువజన శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీవో తెలిపారు. రోజు గంట సేపు మైదానంలో గడపాలన్న అంశం పై ఆయన పలు వివరాలు తెలిపారు. ఇందులో భాగంగా హాకీ పితామహుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి కార్యక్రమాన్ని జూనియర్‌ కళాశాల మైదానంలోని ఖేలో ఇండియా సెంటర్‌లో నిర్వహించారు. ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్‌డీవో మాట్లాడుతు యువత ద్యాన్‌చంద్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అకాంక్షించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత మాట్లాడుతు ప్రస్తుత ఉరుకుల పరుగుల తో కూడిన జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ ఒత్తిళ్ళకు లోనవుతున్నారని, ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం అవసరమన్నారు. జిల్లా వాలీ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్‌ మాట్లా డుతూ ఈనెల 30 వరకు క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. అనంతరం విద్యార్థులకు క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సీనియర్‌ క్రీడాకారులను సన్మా నించారు. స్పోర్ట్స్‌ క్లబ్‌ కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి, సీనియర్‌ ఫిజికల్‌ డైరక్టర్లు అంతటి శంకరయ్య, కలువల వెంకటేశ్‌, ప్రణయ్‌, ఖేలో ఇండియా కోచ్‌ గెల్లు మధూకర్‌, బాక్సింగ్‌ కోచ్‌ రాకేష్‌, అజ్జు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:00 AM