జగిత్యాల జైత్రయాత్రను విజయవంతం చేయండి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:43 PM
గిత్యాలలో సోమవారం జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపుని చ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ నియోజకవర్గానికి చెం దిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, మహిళలు, అభిమానులు భారీగా సభకు హాజరు కావాలని కోరారు.
పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) జగిత్యాలలో సోమవారం జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపుని చ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ నియోజకవర్గానికి చెం దిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు, మహిళలు, అభిమానులు భారీగా సభకు హాజరు కావాలని కోరారు. జగిత్యాలలో జరిగే సభను విజయవంతం చేసి, రాబోయే ఎన్నికల సంగ్రామానికి నాంది కావాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారంలో సభ ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. ఒకే రోజు రెండు సభలు నిర్వహించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమన్నారు. ప్రజలకు వాస్తవాలు చేర నీయకుండా తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇప్పటివరకు అమలు చేయక ప్రజలను మోసం చేశారన్నారు.