10న చలో ఢిల్లీ జయప్రదం చేయండి
ABN , Publish Date - Nov 29 , 2026 | 11:06 PM
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సం దర్భంగా దేశంలో ప్రజాస్వామిక హక్కుల అణచి వేతకు వ్యతిరేకంగా హక్కుల సంఘాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని డిసెంబర్ 10న జయప్రదం చేయా లని ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సీడీఆర్ఓ) పిలుపునిచ్చింది. ఆదివారం ప్రధాన చౌరస్తాలో చలో ఢిల్లీ పోస్టర్లను పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి ఆవిష్క రించారు.
గోదావరిఖని, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సం దర్భంగా దేశంలో ప్రజాస్వామిక హక్కుల అణచి వేతకు వ్యతిరేకంగా హక్కుల సంఘాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని డిసెంబర్ 10న జయప్రదం చేయా లని ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ (సీడీఆర్ఓ) పిలుపునిచ్చింది. ఆదివారం ప్రధాన చౌరస్తాలో చలో ఢిల్లీ పోస్టర్లను పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి ఆవిష్క రించారు. వారు మాట్లాడుతూ దేశంలోని 16హక్కుల సంఘా లతో ఏర్పడిన సీడీఆర్ఓ పిలుపులో భాగంగా దేశంలో అణచి వేతకు గురవుతున్న ప్రజాస్వామిక హక్కులను రక్షించాలనే డిమాండ్‌తో చలో ఢిల్లీ నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. దేశంలో అత్యంత క్రూరమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ’ఉపా’ చట్టా న్ని రద్దు చేయాలని మేధావులు, రైతు సంఘాలు డిమాండ్ చేశాయన్నారు. అక్రమ ఉపా కేసుల్లో నిర్బంధించిన 10వేల మంది ఖైదీలను విడుదల చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజల మధ్య విద్వే షాలను ప్రోత్సహించే విధంగా, ప్రజల హక్కులను, మైనారిటీ ప్రజల పౌరసత్వాన్ని హరించే అప్రజాస్వామిక సర్ ప్రక్రియను రద్దు చేయాలన్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొం కూరు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, ఉపాధ్యక్షుడు వినోద్, బండారు రాజ లింగు, నక్క సత్యనారాయణ, సభ్యుడు బండి శంకర్ గౌడ్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, రైతు సంఘం నాయకులు మల్లన్న పాల్గొన్నారు.