Share News

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:41 PM

రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం పెంచుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి, భూమి పూజ చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించండి

సుల్తానాబాద్‌, జనవరి10(ఆంధ్రజ్యోతి): రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం పెంచుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి, భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో అన్ని మౌలిక సదుపాయా లను కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. రూ.20 కోట్లతో ఇప్పటికే అభి వృద్ధి పనులు చేపట్టామన్నారు. మరో 15 కోట్లను సమకూర్చినట్లు పేర్కొన్నారు. సుల్తా నాబాద్‌ చెరువును మినీట్యాంక్‌ బండ్‌ నిర్మాణానికి రూ.8.30 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పూసాల శంభుని కుంట చెరువును కూడా మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చి దిద్దుతామన్నారు. శంభునికుంట నుంచి ఆరేపల్లి వరకు రోడ్డు ఆధునీకరించి డివైడర్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. సుల్తానాబాద్‌లో రూ.6.50 కోట్లతో అంబేద్కర్‌ చౌరస్తానుండి శాంతినగర్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడు తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులుసాయిరి మహేందర్‌,గణేష్‌, అబ్బయ్యగౌడ్‌, గాజుల రాజమల్లు, శ్రీగిరి శ్రీనివాస్‌, సిద్ద తిరుపతి, బిరుదు కృష్ణ, హౌసింగ్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:41 PM