Share News

మేయర్‌గా మహంకాళి స్వామి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:02 AM

రామగుండం నగర మేయర్‌గా ఎన్నికైన మహంకాళి స్వామి గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట వేద పండితులతో మేయర్‌ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మేయర్‌గా మహంకాళి స్వామి బాధ్యతల స్వీకరణ

కోల్‌సిటీ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రామగుండం నగర మేయర్‌గా ఎన్నికైన మహంకాళి స్వామి గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట వేద పండితులతో మేయర్‌ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, మనాలీ ఠాకూర్‌ దంప తులు, కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు.

ఎమ్మెల్యే సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి రూ.10లక్షలతో చెత్త డబ్బాలు కొనుగోలు చేసే ప్రతిపాదన ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. నగర ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు, వ్యాపార సం ఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 27 , 2026 | 12:02 AM