Share News

పురవీధుల్లో విహరించిన మహాలక్ష్మీ

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:01 AM

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకొని మంథని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పుర వీధుల గుండా వైభవంగా ఆదివారం ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

పురవీధుల్లో విహరించిన మహాలక్ష్మీ

మంథని, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకొని మంథని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పుర వీధుల గుండా వైభవంగా ఆదివారం ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవ్వం చిలుకు తూ గీతాలపనకు అనుగుణంగా పలువురు దంపతులు నృత్యాలు చేస్తుండగా పలువురిపై గులాలు చల్లుకోవడం కన్నుల పండువగా సాగింది. భజనలు, కోలాటాలు, హోలిని త లపించే విధంగా గులాల్‌ చల్లుకున్న భక్తులు పుర వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు ను వైభవంగా నిర్వహించారు. గోపాల కలువల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి దేవి ఉత్సవ విగ్ర హాన్ని ప్రత్యేక వాహనంలో పుర వీధుల్లో ఊరేగింపు సందర్భంగా స్థానిక మందాట, పెంజేరు కట్ట, తమ్మి చెరువుకట్ట, శ్రీ లక్ష్మినారాయణస్వామి, శ్రీమహాలక్ష్మి దేవాలయాల వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయం ముందు ఒక వైపు పై నుంచి ఉట్టి లాగుతుండగా, మరో వైపు కొట్టే వారి పై నీటి చల్లుతున్న సమయంలో ఉ ట్టిని కొట్టేందుకు యువతీ, యువకులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఉట్టి కొట్టే కార్యక్రమా నికి తిలకించేందుకు భక్తులు తరలి వచ్చారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని స్థానిక శ్రీ లక్ష్మినారాయణస్వామి ఆలయంలోని శ్రీదుర్గామాత వద్ద నిర్వాహకులు, దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:01 AM