అనుమతులున్నా లారీలను స్టేషన్‌కు తరలించారు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:57 AM
అన్ని రకాల అనుమతులు ఉన్నా లారీలను ఆపి డ్రైవర్లను బెదిరించి పోలీస్‌స్టేషన్‌కు తరలించ డమే కాకుండా, తన కార్యాలయం వద్ద గల సీసీ కెమెరాల రికార్డిం గ్‌ను డెలిట్ చేయించిన పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐపై, వేధింపులకు పాల్పడుతున్న ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని సానికొమ్ము రాంరెడ్డి కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల అనుమతులు ఉన్నా లారీలను ఆపి డ్రైవర్లను బెదిరించి పోలీస్‌స్టేషన్‌కు తరలించ డమే కాకుండా, తన కార్యాలయం వద్ద గల సీసీ కెమెరాల రికార్డిం గ్‌ను డెలిట్ చేయించిన పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐపై, వేధింపులకు పాల్పడుతున్న ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని సానికొమ్ము రాంరెడ్డి కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఆయన నిబంధనల ప్రకారం తుర్క లమద్దికుంటలో అన్ని రకాల అనుమతులతో క్వారీ వ్యాపారం చేసుకుంటున్నానని, ఈ నెల 19న రూరల్ ఎస్‌ఐ మల్లేశం వచ్చి డ్రైవర్లను బెదిరించి లారీలను పట్టుకవెళ్లారని, సీసీ టీవీ రికార్డింగ్‌ను డెలిట్ చేయించారని పేర్కొన్నారు. జిల్లా మైనింగ్ శాఖాధికారి, సీఐ వేధింపులకు గురి చేస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాంరెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు 69/ఈ సర్వే నెంబర్‌లో 26 గంటల భూమి ఉందని, తన భూమిని తప్పుడు కాగితాలతో అమ్మినట్లు కాగితాలు చూపించి పట్టా చేయించుకోవాలని చూస్తున్నారని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని, తన పట్టా ఎవరి పేరు మీద చేయవద్దని యైుటింక్లయిన్ కాలనీకి చెందిన కె రాజమ్మ కలెక్టర్‌ను కోరారు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యిందని, ఇంటి నిర్మాణానికి 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందని, అంత డబ్బు తన వద్ద లేదని, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు సరిపోవని రేకుల షెడ్డు నిర్మాణం కోసం వెసలుబాటు కల్పించాలని జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన భూమయ్య కోరారు. తనకు ఆరేళ్ల క్రితం రైలు ప్రమాదంలో కాలు పోయిందని, దివ్యాంగుల పెన్షన్, అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎస్ మదన్ మోహన్ కలెక్టర్‌ను కోరారు. అనంతరం ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను శరవేగంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.