Share News

తునికాకు సేకరణకు ఎదురుచూపులు

ABN , Publish Date - May 10 , 2026 | 11:48 PM

మంథని డివి జన్‌లోని అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేక రణకు ఎదురు చూస్తున్నారు. యేటా వేసవిలో తునికాకు సేకరణ అటవీ గ్రామాల ప్రజలకు ఆర్థిక చేయూత ఇస్తుంది. యేటా ఏప్రిల్‌ 3వ వారంలో ప్రారంభమై దాదాపు నెల రోజుల పాటు అటవీ గ్రామాల్లో సందడిగా కొనసాగే తునికాకు సేకరణ ఈ సంవత్సరం ఆలస్యమైంది.

తునికాకు సేకరణకు ఎదురుచూపులు

మంథని, మే 10 (ఆంధ్రజ్యోతి): మంథని డివి జన్‌లోని అటవీ గ్రామాల ప్రజలు తునికాకు సేక రణకు ఎదురు చూస్తున్నారు. యేటా వేసవిలో తునికాకు సేకరణ అటవీ గ్రామాల ప్రజలకు ఆర్థిక చేయూత ఇస్తుంది. యేటా ఏప్రిల్‌ 3వ వారంలో ప్రారంభమై దాదాపు నెల రోజుల పాటు అటవీ గ్రామాల్లో సందడిగా కొనసాగే తునికాకు సేకరణ ఈ సంవత్సరం ఆలస్యమైంది. అడవిలో నాణ్యమైన తునికాకు ఇప్పటివరకు ముదరక పోవ డంతో ఆకు సేకరణ ప్రారంభం కాలేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మరో వారం రోజుల వరకు తునికాకు ముదిరే అవకాశం ఉండ టంతో ఆకు సేకరణకు అప్పుడే ప్రారంభకానుంది.

మంథని ప్రాంతంలో మూడు యూనిట్లు

తునికాకు సేకరణ కోసం ఈ సంవత్సరం మంథని రేంజ్‌ పరిధిలోని ఖమ్మంపల్లి, ముత్తారం -ఏ, ముత్తారం-బీ యూనిట్లకు ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. ఖమ్మంపల్లి యూనిట్‌ పరిధిలో చిన్నఓదాల, ధర్మారం-ఏ, గోపాల్‌పూర్‌-బీ, జిల్లల్లపల్లి -ఏ,-బీ, ఖమ్మంపల్లి -ఏ,-బీ, సీతంపేట గ్రామాల కళ్లాలు ఉన్నాయి. ముత్తారం-ఏ యూనిట్‌ పరిధిలో అడవిశ్రీరాంపూర్‌, ముత్తారం, ఓడేడ్‌ గ్రామాల కళ్లాలు ఉన్నాయి. ముత్తారం-బీ యూనిట్‌ పరిధిలో కేశనపల్లి, దర్యాపూర్‌, హరిపురం, మచ్చు పేట, మైదంబండ, పారుపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈసంవత్సరం 50 ఆకుల కట్టకు రూ. 3.40 పైసలు చెల్లించాలని నిర్ణయించారు. 3యూనిట్లలోని 17 కళ్లాల్లో 3200 స్టాండర్డ్‌బ్యాగ్‌ల లక్ష్యంగా నిర్ణయించారు.

Updated Date - May 10 , 2026 | 11:48 PM