Share News

కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యండి

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:15 AM

బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్‌ అశోక థియేటర్‌ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.

కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యండి

గోదావరిఖని, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్‌ అశోక థియేటర్‌ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్‌ఎస్‌ అస్తవ్యస్థంగా చేసింద న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్య ర్థులను గెలిపిస్తేనే అభి వృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను జవాబుదారితనంతో అమలు చేస్తామన్నారు. రామ గుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కృషి చేస్తున్నారన్నారు. రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థు లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్‌రావు, మినిమమ్‌ వేజ్‌బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 12:15 AM