లోడింగ్, అన్‌లోడింగ్ వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:49 PM
ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం గంగాపురిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
మంఽథని, మే 5 (ఆంధ్రజ్యోతి): ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం గంగాపురిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన పంట పరిమాణం, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను పరిశీలించారు. తేమ ఉన్న పంటలను వెం టనే కొనుగోలు చేసి మిల్లర్లకు త్వరతగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో అవస రమైన టార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని, గన్ని బ్యాగుల సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారు లను ఆదేశించారు. రహణా వాహనాలు, హమాలీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలన్పారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏడిఏ అంజనిలు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ పనులు వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. నర్సా పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అవసరమైన టార్పలిన్‌లు సిద్ధంగా ఉంచాల న్నారు. గన్నీ బ్యాగుల సరఫరాను ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోడింగ్, అన్‌లోడింగ్ పనుల్లో వేగం పెంచాలన్నారు. రవాణా, హమాలీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ యాకన్న, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏడీఏ అంజని అధికారులు ఉన్నారు.