Share News

మహిళలకు అక్షరాసత్యపై శిక్షణ

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:46 PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అక్షర ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లాంగ్‌ లైవ్‌ ఆల్‌ సొసైటీ) కార్యక్రమంలో ద్వారా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మహిళలకు అక్షరాసత్యపై శిక్షణ

సుల్తానాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అక్షర ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లాంగ్‌ లైవ్‌ ఆల్‌ సొసైటీ) కార్యక్రమంలో ద్వారా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలు వార్డులకు చెందిన చదువురాని మహిళలకు చదవడం రాయడం నేర్పిస్తున్నారు. ఆదివారం మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథి గా పాల్గొన్న మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాక్రిష్ణ మాట్లాడుతు మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో చదువురాని మహిళలను గుర్తించి వారందరికీ ప్రభుత్వం పుస్తకాలు పంపిణీ చేసిందన్నారు. ఆయా వార్డుల వారీగా వలంటీర్లను నియమించి చదువు చెప్పించి పరీక్షలు నిర్వహించామన్నారు. కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, ఊట్ల వరప్రదీప్‌, కందునూరి సమత, గరిగె శోభారాణి, బాకం సాయి, చింతల రాజు.మంజుల పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:46 PM