Share News

భరోసా కల్పించేలా లైసెన్స్‌ సర్వేయర్‌లు పని చేయాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:48 PM

భూ రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కలిఁంచేలా లైసెన్స్‌ సర్వేయర్‌లు పని చేయా లని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డి వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది సర్వేయర్లకు ధృవీకరణ లైసెన్స్‌ పత్రాలను అందజేశారు.

 భరోసా కల్పించేలా లైసెన్స్‌ సర్వేయర్‌లు పని చేయాలి

పెద్దపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): భూ రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కలిఁంచేలా లైసెన్స్‌ సర్వేయర్‌లు పని చేయా లని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డి వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది సర్వేయర్లకు ధృవీకరణ లైసెన్స్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు చుట్టంగా ఉండే విధంగా అద్భుతమైన భూ భారతి చట్టంను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. భూ భారతి చట్టం నియమ నిబంధనలు కూడా 90 రోజుల్లో రూపొందిం చారని అన్నారు. ప్రతి మనిషికి ఆధార్‌ కార్డు ఉన్న విధంగా భూములకు భూధార్‌ కార్డులను ప్రవేశపెడతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, అవ సర మైన మేర లైసెన్స్‌ సర్వేయర్‌లు అందుబాటులో ఉండే విధంగా వివిధ రాష్ట్రాలలో అధ్యయనం చేసి పైవ్రేట్‌ సర్వేయర్‌లను ప్రవేశపె ట్టామని అన్నారు. జిల్లాలో అర్హత సంపాదించిన 61 మంది అభ్యర్థులకు లైసెన్సులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్‌ సర్వేయర్‌లను మండలాల వారీగా ప్రతి అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా అలాట్మెంట్‌ చేస్తామని అన్నారు. భూములు ఉన్న రైతులకు భరోసా కల్పించే భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్‌లకు ఆధునిక సాంకేతిక వినియోగించేందుకు రోవర్స్‌ సామాగ్రి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీి సోమేశ్వర్‌, ఆర్‌డీఓ గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:48 PM