Share News

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:24 PM

ప్రతీ ఒక్కరు గ్రంథా లయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అం తటి అన్నయ్యగౌడ్‌ అన్నారు. శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్స వాలు ముగింపు సమావేశంలో భాగంగా చైర్మన్‌ అధ్యక్షతన ఆరు రోజులు వివిధ పోటీలో పాల్గొన్న కళాశాల, పాఠశాల విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు గ్రంథా లయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అం తటి అన్నయ్యగౌడ్‌ అన్నారు. శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్స వాలు ముగింపు సమావేశంలో భాగంగా చైర్మన్‌ అధ్యక్షతన ఆరు రోజులు వివిధ పోటీలో పాల్గొన్న కళాశాల, పాఠశాల విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఇక్కడ పుస్తకాలు అందుబాటులో ఉంచామని, వాటిని వినియోగించు కోవాలని కోరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్‌ సహకారంతో 5 కోట్ల రూపాయలతో గ్రంథాలయ భవనం నిర్మిస్తున్నామని, అతి త్వరలో మూడు అంతస్తుల గ్రంథాలయ భవనం అందుబాటులోకి వస్తుంద న్నారు. జిల్లా బాలికల డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కవిత మాట్లాడుతూ ప్రస్తుతం యువత సోషల్‌ మీడియాలో కాలం గడుపుతూ సమయం వృథా చేస్తున్నారని, ఆ సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించి పుస్తక పఠన చేసి విజ్ఞానం పెంచుకొని పోటీ పరీక్షలు హాజరై ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. డీఎల్‌పిఓ దేవిక మాట్లాడుతూ విజ్ఞానం ఒక సముద్రమని, ఎంత తెలుసుకున్నా తక్కువేనన్నారు. ఖాళీ సమయం గ్రం థాలయానికి కేటాయించాలని తద్వారా విజ్ఞానం పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఇంచార్జి కార్యదర్శి కనక లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకొని పుస్తకాన్ని ఇంటికి తీసుకుపోయి చదువుకోవచ్చన్నారు. పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ మహమ్మద్‌ గఫార్‌, సీఆర్‌పి బాలసాని వెంకటేష్‌, శ్రీనివాస్‌, సుందరగిరి శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ పాలకులు యునుస్‌ ఖాద్రి, కవిత, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:24 PM