మట్టి గణపతిని పూజిద్దాం
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:03 AM
పర్యావరణ పరిరక్ష ణకు మట్టి గణపతిని పూజిద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణలో మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రజలందరికి మట్టి వినాయక విగ్రహాలను అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలి పారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్ష ణకు మట్టి గణపతిని పూజిద్దామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం పట్టణలో మున్సిపల్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గ ప్రజలందరికి మట్టి వినాయక విగ్రహాలను అందించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలి పారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కావాలని, రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సి లర్లు, కమిషనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.