పర్యావరణ రక్షణకు మట్టి గణపతులను పూజిద్దాం
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:15 AM
పర్యావరణ పరి రక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిం చారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరి రక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఆయన మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పీఓపీ విగ్రహాల నిమజ్జనం వల్ల జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరులు కలుషితమవుతాయని, దీని వల్ల ప్రకృతితోపాటు ప్రాణికోటికి హానికర మన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసర మన్నారు. పర్యావరణహితం కోసం రెండు వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాలకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీజీపీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ కనకజ్యోతి, ఏఓబీ ప్రకాష్, సూపరిండెంట్ కోటేశ్వర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీవాణి పాల్గొన్నారు.