ఎల్‌నినో కారణంగా వనరులను పొదుపుగా వాడుకుందాం
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:58 PM
ప్రపంచ వ్యాప్తం గా నెలకొన్న ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి వనరులను పొదుపుగా వాడుకోవాల్సిన సామాజిక బాధ్యత అందరి పై ఉందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కోరారు.
మంథని, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తం గా నెలకొన్న ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి వనరులను పొదుపుగా వాడుకోవాల్సిన సామాజిక బాధ్యత అందరి పై ఉందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కోరారు. క్యాంపు ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు, కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ఆదివా రం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నుంచి బయట పడటానికి ప్రజలను అప్రమత్తం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందన్నారు. వచ్చే జూన్ వరకు నీటిని, కరెంట్‌ను చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. వర్షాలు తక్కవ పడిన ఈ ప్రాంతంలో చివరి దశలో ఉన్న రైతుల పంటలు ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి సాగు నీరు అందించి ఆదుటకుంటున్నామన్నారు. కుట్టులో శిక్షణ ఇచ్చిన మహిళల కోసం త్వరలోనే మంథనిలో గార్మెం టరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తా మన్నారు. శ్రీపాద డెయిరీ ద్వారా మహిళలకు పాడి పరి శ్రమ ద్వారా ఆర్థికంగా చేయూత నిస్తామన్నారు. డివి జన్‌లోని వివిధ గ్రామాల్లో వీవో, అంగన్వాడి భవనాల కోసం కోట్లాది రూపాయాల నిధులు మంజూరు చేయించా మన్నారు. ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రభుత్వంగా తాము, అధికారులు ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం మహాలక్ష్మి అలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడులకు వద్దకు వెళ్ళి మహిళలను ఉత్సాపర్చారు. ప్రజలందరికి దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంటన కాంగ్రెస్ నేతలు ఉన్నారు.