Share News

ఇక్కడ అన్‌లోడ్‌ చేసుకోం...

ABN , Publish Date - May 26 , 2026 | 11:38 PM

మక్కలు దిగు మతి చేసుకోవాలని మండల కేంద్రంలో రైతులు మం గళవారం రాస్తారోకో చేపట్టారు. ఓదెల మండలంలోని మొక్కజొన్న రైతులు పొత్కపల్లి మార్కెట్‌ యార్డుకు మక్కలు తీసుకువచ్చారు.

ఇక్కడ అన్‌లోడ్‌ చేసుకోం...

కాల్వశ్రీరాంపూర్‌, మే26(ఆంధ్రజ్యోతి): మక్కలు దిగు మతి చేసుకోవాలని మండల కేంద్రంలో రైతులు మం గళవారం రాస్తారోకో చేపట్టారు. ఓదెల మండలంలోని మొక్కజొన్న రైతులు పొత్కపల్లి మార్కెట్‌ యార్డుకు మక్కలు తీసుకువచ్చారు. సెంటర్‌ నిర్వాహకులు రెండు రోజుల క్రితం ట్రక్‌షీట్‌ రాసి కాల్వశ్రీరాంపూర్‌ మార్కెట్‌ యార్డు గోదాంలో దిగుమతికి రైతులకు పంపినట్లు తెలి పారు. కాల్వరాంపూర్‌ గోదాంలో దిగుమతి చేసుకోమని చెప్పడంతో రైతులు మండల కేంద్రంలోని మొట్లపల్లి క్రాస్‌ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. రైతులు మాట్లాడు తూ మక్కల సెంటర్‌ నిర్వాహకులు సీరి యల్‌ ప్రకారం దించుకుంటామని చెప్పా రని, ట్రాక్టర్లలో లోడ్‌ చేసి రెండు రోజలవు తుందన్నారు. వర్షం, గాలి వాన, మబ్బులు వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల నుంచి దిగుమతి చేసుకుం టామని చెప్పి తీరా గోదాంలో స్థలం లేదని కమాన్‌ పూర్‌, మంథని తీసుకెళ్లాలని నిర్వాహకులు చెప్పార న్నారు. అక్కడి గోదాంలో దిగుమతి చేసుకోవడానికి ట్రక్‌షీట్‌ పని చేయదని మళ్లీ ఆన్‌లైన్‌ చేసిన తీసు కోదని ధర్నా చేపట్టినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ వెంకటేష్‌ చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

Updated Date - May 26 , 2026 | 11:39 PM