Share News

సమష్టి కృషితో రామగుండం అభివృద్ధి చేసుకుందాం

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:36 PM

సమిష్టి కృషితో రామగుంగం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మేయర్‌ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎన్‌సీఓఏ క్లబ్‌లో కాలనీలోని ఏడు డివిజన్లలో వార్డు సభ జరిగింది.

సమష్టి కృషితో రామగుండం అభివృద్ధి చేసుకుందాం

యైుటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): సమిష్టి కృషితో రామగుంగం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మేయర్‌ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎన్‌సీఓఏ క్లబ్‌లో కాలనీలోని ఏడు డివిజన్లలో వార్డు సభ జరిగింది. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడారు. కార్పొరేషన్‌లో వెయ్యి కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ సూచనలు పాటించాలని, వర్షాకాలంలో విపత్తులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్‌ పేర్కొన్నారు. 100 కోట్లతో ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరాకు పనులు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ నిధులతో కొత్త పైప్‌లైన్లు, నీటి ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు మేయర్‌ తెలిపారు. గత అనభవాలను దృష్టిలో ఉంచుకుని కాలనీలోని గోపాల్‌నగర్‌ ప్రాంతాల్లో 5 కోట్లతో పక్కా డ్రెనేజీ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. భూగర్భ జలమట్టం పెరగడానికి ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నట్టు మేయర్‌ పేర్కొన్నారు. ఎంఆర్‌ఓ రవీందర్‌ ఓటరు జాబితా సంబంధించి సర్‌ ప్రాసెస్‌ని వివరించారు. డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, నగరపాలక సంస్థ ఏసీపీ శ్రీహరి, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌, టూటౌన్‌ సీఐ ప్రసాదరావు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:36 PM