Share News

‘సాగు’దామా.. ఆగుదామా

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:41 AM

ఎల్‌నినో ప్రభావంతో రైతులు యాసంగి సాగుపై సందిగ్ధంలో పడ్డారు. ఈ సీజన్లో నీటికొరత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరిసాగు వద్దని ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా జిల్లాలో కొన్నిచోట్ల రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతూ నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు.

‘సాగు’దామా.. ఆగుదామా

(ఆంరఽధజ్యోతి, సిరిసిల్ల)

ఎల్‌నినో ప్రభావంతో రైతులు యాసంగి సాగుపై సందిగ్ధంలో పడ్డారు. ఈ సీజన్లో నీటికొరత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరిసాగు వద్దని ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా జిల్లాలో కొన్నిచోట్ల రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతూ నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఎక్కువ శాతం రైతులు యాసంగి పై సందిగ్ధంలో పడ్డారు. బోరుబావులను నమ్ముకొని సాగు చేద్దామని అనుకున్నా.. తవ్వడానికి ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి చేసింది.

యాసంగిలో 1.26లక్షల ఎకరాల్లో సాగు అంచనా..

జిల్లాలో ఖరీఫ్‌ వరికోతలు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు యాసంగి సాగులో ఆరుతడి పంటలు వేసే విధంగా వ్యవసాయశాఖ యాక్షన్‌ ప్లాను తీసుకొచ్చింది. జిల్లాలో గత సంవత్సరంలో 2025-26లో 2లక్షల 10వేల 576ఎకరాలు వివిధ పంటలు సాగుచేశారు. 2026-27సంవత్సరం ప్రస్తుత యాసంగిలో 126737ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. గత సంవత్సరంతో పోలిస్తే 40వేల ఎకరాలు సాగు తగ్గింది. జిల్లాలో గత యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని 71810 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. భారీగా వరిసాగు తగ్గించి ఆరుతడి పంటలు వేసే విధంగా చూస్తున్నారు. శనగ 2370 ఎకరాలు, కుసుమ 1675ఎకరాలు, పొద్దు తిరుగుడు 7710ఎకరాలు, వేరుశనగ 3320ఎకరాలు, మొక్కజొన్న 2362ఎకరాలు, నువ్వులు 2015ఎకరాలు, చెరకు 890ఎకరాలు పశుగ్రాసం 7710ఎకరాలు, ఆయిల్‌ పామ్‌ 2450ఎకరాలు, కూరగాయలు 2940ఎకరాలు సాగుచేస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

భూగర్భ జలాలు.. విద్యుత్‌ సరఫరాపై కలవరం

యాసంగి సాగుకు విద్యుత్‌సరఫరా, భూగర్భజలాల లభ్యతపై రైతుల్లో కలవరం నెలకొంది. వానకాలం సీజన్‌ల్లో విద్యుత్‌ సమస్యలు ఎదుర్కొన్న రైతులు వచ్చే వేసవిలో విద్యుత్‌సరఫరా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. బోరుబావుల్లో నీళ్లు ఉన్నా విద్యుత్‌ సరఫరా లేకుంటే ఎలాగోననే ఆలోచనలో పడ్డారు. వానాకాలం సీజన్‌లో వరిపంటను దక్కించుకో వడానికి జనరేటర్ల ద్వారా బోరుబావులను నడిపించారు. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో బోరు బావులు, వ్యవసాయబావుల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయి. జిల్లాలో సగటున 7.82మీటర్ల లోతుకు జలాలు పడిపోయాయి. గత సంవత్సరం అక్టోబర్లో సగటున 5.13మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉంటే ఈ సంవత్సరం అక్టోబర్‌లో సగటున 7.82మీటర్లకు తగ్గిపోయింది. జిల్లాలో అత్యధికంగా వేములవాడ అర్బన్‌ మండలంలో 15.39మీటర్లకు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. సిరిసిల్లలో 14.08 మీటర్లు, వీర్నపల్లిలో 13.03మీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 10.91మీటర్లు, ముస్తాబాద్‌లో 8.50మీటర్లు, గంభీరావుపేట 8.39మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. చాలా గ్రామాల్లో నీటి లభ్యత తగ్గిపోయి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు లేక జిల్లాలోని చెరువుల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు చేరలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో ఏర్పడ్డ మార్పులకు చెరువులు, బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.

జిల్లాలో మండలాల వారీగా భూగర్భ జలాలు (మీటర్ల లోతులో)

మండలం గత సంవత్సరం (అక్టోబరు) 2026- అక్టోబరు

బోయినపల్లి 3.20 4.78

చందుర్తి 3.50 5.31

గంభీరావుపేట 5.09 8.39

ఇల్లంతకుంట 2.45 4.65

కోనరావుపేట 5.17 7.03

ముస్తాబాద్‌ 5.57 8.50

రుద్రంగి 2.78 7.45

సిరిసిల్ల 10.75 14.62

తంగళ్లపల్లి 5.41 7.80

వీర్నపల్లి 7.83 13.03

వేమువలాడ రూరల్‌ 3.84 4.81

వేములవాడ 11.45 15.39

ఎల్లారెడ్డిపేట 7.55 10.91

-------------------------------------------------------------------------

సరాసరి 5.13 7.82

Updated Date - Nov 22 , 2026 | 12:41 AM